Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరోనాతో ఛాయాగ్రాహకుడు జానీలాల్‌ కన్నుమూత

కరోనాతో ఛాయాగ్రాహకుడు జానీలాల్‌ కన్నుమూత

చిత్రపరిశ్రమలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఛాయాగ్రాహకుడు జానీలాల్‌ బుధవారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఓ హిందీ చిత్రానికి పనిచేస్తున్న ఆయన రెండు వారాల క్రితం కరోనా బారిన పడ్డారు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి ఆయన మరణించారు. హృతిక్‌ రోషన్‌ నటించిన 'యాదేన్‌', సునీల్‌ శెట్టి 'లాకీర్‌', గోవిందా, సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'పార్టనర్‌', తుషార్‌ కపూర్‌ తొలి సినిమా 'ముఝే కుచ్‌ కెహనా హై' తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా కూడా పనిచేశారు. నటులు మాధవన్‌, తుషార్‌ కపూర్‌ తమ తొలి హిందీ చిత్రాలకు జానీలాల్‌ పనిచేసిన సంగతి గుర్తు చేసుకొని ఆయనకు నివాళులు అర్పించారు.

జానీలాల్‌ తండ్రి ఎస్‌.ఎస్‌.లాల్‌ కూడా తెలుగులో పేరొందిన ఛాయాగ్రాహకుడు. ట్రిక్‌ షాట్స్‌ తీయాలంటే ఆ రోజుల్లో ఆయన్నే పిలిచేవారు. జానీలాల్‌ సోదరుడు కబీర్‌లాల్‌ కూడా పేరొందిన ఛాయాగ్రాహకుడు. సోదరుడితో కలసి జానీలాల్‌ కొన్ని తెలుగు చిత్రాలకు పనిచేశారు కూడా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy