Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కరోనాతో మరణిస్తే...

ముంబై : కరోనా వైరస్ వల్ల మరణించిన ఉద్యోగులకు సంబంధిత బ్యాంక్ నుండి భారీ ఊరట లభించనుంది. ఈ క్రమంలో... వారి కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలగనుంది. కరోనాతో మృతిచెందిన పక్షంలో... రుణాల మాఫీ జరగనుంది. అంతేకాకుండా... ఉ ఉద్యోగి జీవిత భాగస్వామికి బ్యాంక్‌లో ఉద్యోగం కూడా లభిస్తుంది. వివరాలిలా ఉన్నాయి.

కోవిడ్ 19 తో మరణించిన తన ఉద్యోగులకు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్... వెసులుబాటు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోంది. వారి సీటీసీకి నాలుగు రెట్ల పరిహారం చెల్లించేందుకు నిర్ణయించింది. మరోవైపు... కుటుంబసభ్యులకు రెండేళ్ల వరకు వేతనాన్ని అందిస్తోంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వి. విద్యానాధన్ ఈ విషయాలను వెల్లడించారు.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

దీంతో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరనుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

కరోనా కారణంగా మృతిచెందినపక్షంలో ఆయా ఉద్యోగులకు హోం లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బైక్ లోన్... ఇలా ఎలాంటి రుణాలు తీసుకుని ఉన్నప్పటికీ... వాటిని మాఫీ చేస్తామని బ్యాంక్ తెలిపింది. గరిష్టంగా రూ. 25 లక్షల వరకు మొత్తం మాఫీ లభిస్తుందని బ్యాంకు పేర్కొంది. ఇప్పటి వరకు 20 మంది బ్యాంక్ ఉద్యోగులు కరోనాతో మరణించారని వెల్లడించింది.

అంతేకాకుండా ఇలా మరణించిన వారి భాగస్వామికి బ్యాంక్‌ ఉద్యోగం దక్కనుంది. ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే రూ. 2 లక్షలు అందిస్తామని, దీని ద్వారా నైపుణ్యాలు పెంచుకొని, మరో ఉద్యోగం కోసం ప్రతయ్నించే వీలుంటుంది. ఇక ఇద్దరు పిల్లల చదువు కోసం రూ. 10 వేలు అందించనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంత వరకు ఈ సాయం అందనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy