Dailyhunt
కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌వే..

కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌వే..

  • రేపు మూడు గంటల పాటు ట్రయల్‌ రన్‌

  • ఇది ప్రయోగాత్మకమే: జోయల్‌ డేవిస్‌

హైదరాబాద్: నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఈనెల 6వ తేదీన ప్రయోగాత్మకంగా మూడు గంటల పాటు వన్‌వేను అమలు చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర జాయింట్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఈ విషయాన్ని తెలిపారు. బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద జరుగుతున్న పనులను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ కేబీఆర్‌ పార్కు వద్ద జరుగుతున్న స్టీల్‌ ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనుల దృష్ట్యా, ట్రాఫిక్‌ మళ్లింపులు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇది కేవలం ట్రయల్‌రన్‌ మాత్రమేనని, ఇందులో సమస్యలు, లోటు పాట్లు తెలుసుకున్నాక భవిష్యత్తులో అమలు చేయాలా లేదా అనేది నిర్ణయిస్తామన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఆంక్షలు, మళ్లింపులు అమలు అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీసీపీ కాజల్‌, అడిషనల్‌ డీసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఏసీపీ కట్టా హరిప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్లు నరేందర్‌, కె.సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

 ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా..

  • ఎన్‌ఎఫ్‏సీఎల్‌ నుంచి కేబీఆర్‌ పార్కు ప్రవేశ ద్వారం మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలు ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద ఎడమ మలుపు తీసుకుని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి కూడళి, అగ్రసేన్‌ ఐలాండ్‌, అపోలో ఎక్స్‌రోడ్‌, జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45 మీదుగా చెక్‌పోస్టుకు చేరుకోవాలి.

  • యూసుఫ్‏గూడ, శ్రీనగర్‌ కాలనీ నుంచి రోడ్‌ నం. 36, 45, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ ఇందిరానగర్‌, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం. 5, వెంకటగిరి జంక్షన్‌ వద్ద కుడి మలుపు తీసుకొని డైమండ్‌ హౌస్‌ ద్వారా రోడ్‌ నం. 10, జూబ్లీహిల్స్‌ వైపు కొనసాగాలి. ఆల్‌ కాజర్‌ వద్ద కుడివైపు తిరిగి రోడ్డు నంబరు 36 నీరూస్‌ మీదుగా మాదాపూర్‌ వెళ్లాలి.

/span>

స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పాత పేరు.. కొత్త అజెండా!

Read Latest Telangana Newsand National News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy