Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతి

నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు

హైకోర్టుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడానికి అనుమతించామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన హైకోర్టుకు నివేదించారు. కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసినా.. ప్రైవేటు పాఠశాలల్లో టర్మ్‌ ఫీజులు, లైబ్రరీ, ట్రాన్స్‌పోర్టు, స్పెషల్‌ ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయంటూ ప్రజాహిత వ్యాఖ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో హైకోర్టుకు డివిజన్‌ బెంచ్‌కు విద్యాశాఖ డైరెక్టర్‌ అదనపు అఫిడవిట్‌ను సమర్పించారు.

ఇప్పటివరకు 55 ప్రైవేటు పాఠశాలలపై ఫిర్యాదులు అందాయని, ఆయా పాఠశాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. ఇందుకు 47 పాఠశాలలు బదులిచ్చాయని, క్షేత్రస్థాయిలో తనిఖీల నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy