Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సర్‌ప్రైజ్! స్వయంగా దోశ వేసి..

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సర్‌ప్రైజ్! స్వయంగా దోశ వేసి..

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరమ్ కేఫ్ అంటే తెలియని వారు ఉండరు. అక్కడకు వెళితే కచ్చితంగా దోశ తినాలని సిఫార్సు చేసే వారు కోకొల్లలు.

అయితే, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాత్రం దోశ రుచి చూడటంతో ఆగిపోలేదు. స్వయంగా దోశ వేసి, కస్టమర్‌కు సర్వ్ చేసి సిబ్బంది సహా అక్కడున్న వారందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించి వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

రామేశ్వరమ్ కేఫ్‌కు వెళ్లిన ఆయన ఆ తరువాత లోపలి కిచెన్‌లోకి వెళ్లి స్టాఫ్‌ను సర్‌ప్రైజ్ చేశారు. పెనంపై దోశ వేసి, అరటి ఆకు ఉన్న ప్లేట్‌లో పెట్టి.. చట్నీ, సాంబార్ వంటి వాటితో అక్కడే ఉన్న ఓ కస్టమర్‌కు స్వయంగా అందించారు. దీంతో, అతడు కూడా సర్‌ప్రైజ్ అయ్యాడు.

ఈ వీడియో షేర్ చేస్తూ ఉండబట్టలేక దోశ వేశానని కామెంట్ చేశారు. 'నిపుణులైన షెఫ్‌ల పర్యవేక్షణలో ఈ రోజు దోశలు వేశను. వాస్తవానికి దోశ వేయడం అనుకున్నంత ఈజీ కాదు. కంటికి కనిపించేదాని కంటే ఎంతో ఉంది. బెంగళూరుకు వచ్చాక ఒక్కసారైన రామేశ్వరం కేఫ్‌కు వెళ్లాల్సిందే' అని ఆయన కామెంట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దోశలు వేయడంలో మంచి నైపుణ్యం కేంద్ర మంత్రికి ఉందని పలువురు కితాబునిచ్చారు. మంత్రి సింధియా గతంలో కూడా ఓసారి స్వయంగా కాఫీ తయారు చేసిన వీడియోను షేర్ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

వైరల్‌గా మారిన చండీగఢ్ యూనివర్సిటీ డ్యాన్స్ వీడియో.. ఎందుకింత చర్చ?

ఆకాశంలో వింత .. అది యూఎస్ ప్రయోగించిన బ్లాక్ మాంటా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy