Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపు లేఖ

కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపు లేఖ

ఢిల్లీ, సెప్టెంబర్ 1: కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్‌కు ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపు లేఖ వచ్చింది.

పోస్ట్ (తపాలా) ద్వారా వచ్చిన ఒక సంతకం లేని లేఖలో, 'కరుడుగట్టిన ఉగ్రవాదులు త్వరలోనే నిన్ను హత్య చేస్తారు' అని హెచ్చరించినట్లు ఆయన కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ లేఖలో రెండు మొబైల్ నంబర్లును కూడా పేర్కొన్నారు.

హోం కార్యదర్శికి ఫిర్యాదు.. విచారణకు విజ్ఞప్తి

తీవ్రమైన ఈ బెదిరింపు లేఖపై చిరాగ్ పాశ్వాన్ అదనపు ప్రైవేట్ కార్యదర్శి ఆలోక్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అత్యవసర లేఖ రాశారు. బెదిరింపు లేఖ మూలాలు, దాని ప్రామాణికతపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

ప్రస్తుతం చిరాగ్ పాస్వాన్‌కు కేంద్ర హోంశాఖ ద్వారా 'Z' కేటగిరీ భద్రత ఉంది. అయితే, ఈ బెదిరింపుల నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లను పునఃసమీక్షించి, అవసరమైతే మరింత భద్రతను పెంచాలని హోం కార్యదర్శిని కోరారు. కేంద్రమంత్రి రాబోయే బహిరంగ కార్యక్రమాలు, పర్యటనలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

దీంతో ఈ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చింది, లేఖ వెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy