Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కెప్టెన్ మచ్చార్ ధైర్యాన్ని ఎందుకు మెచ్చుకోలేదు'.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

'కెప్టెన్ మచ్చార్ ధైర్యాన్ని ఎందుకు మెచ్చుకోలేదు'.. కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

ఢిల్లీ, అక్టోబర్ 2: కెప్టెన్ మచ్చార్ సాహసాన్ని చూసి యావద్భాతరం గర్వపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మరో 9/11 తరహా ఘటన జరగకుండా ప్రాణాలను పణంగా పెట్టడాన్ని, అతని ధైర్యసాహసాలను చూసి యావత్ ప్రపంచం హర్షించిందని తెలిపారు.

భారతీయుడు ప్రదర్శించిన ధైర్యసాహసాలను గుర్తించి, అభినందించాలన్న ఇంగిత జ్ఞానం కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. అర్థం పర్థంలేని అంశాలపైనా స్పందించి, తాను ప్రపంచాన్ని మారుస్తున్నట్లు మాట్లాడే రాహుల్ గాంధీ.. ఈ ఒళ్లు గగుర్పొడిచే సందర్భం గురించి, కెప్టెన్ స్మిత్ మచ్చార్ గురించి మాట్లాడటం సంగతి పక్కనపెడితే.. కనీసం ఆయన ధైర్యసాహసాలను అభినందిస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా చేయలేకపోయారని విమర్శించారు.

అసలు సోనియా గాంధీ కుటుంబం ప్రాబ్లమ్ ఏంటి అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భారత్ గురించి, భారతీయుల గురించి ఏదైనా మంచి జరిగితే, భారతీయుల శక్తి, సామర్థ్యాలను ప్రపంచమంతా కీర్తిస్తే వారికి ఎందుకు నచ్చదని నిలదీశారు. భారతీయుడు తన ధైర్యసాహసాలతో అంతర్జాతీయ నేతల ప్రశంసలు అందుకుంటుంటే.. నెహ్రూ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అలవాటు ఇది అంటూ మండిపడ్డారు. అందుకే త్వరలోనే కాంగ్రెస్ రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy