Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కెప్టెన్‌గా తొలి డీఆర్ఎస్ తీసుకున్న వైభవ్ సూర్యవంశీ..

కెప్టెన్‌గా తొలి డీఆర్ఎస్ తీసుకున్న వైభవ్ సూర్యవంశీ..

స్పోర్ట్స్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే దులీప్ ట్రోఫీలో కెప్టెన్‌గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన మార్క్‌ను చూపించాడు.

కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ తన నాయకత్వ పటిమతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇషాన్ కిషన్ స్థానంలో ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న వైభవ్.. మొట్టమొదటి సారి డీఆర్ఎస్ తీసుకున్నాడు. అంతేకాక తాను రివ్యూ తీసుకోవడం సరైనదేనని నిరూపించుకున్నాడు. సెమీఫైనల్ పోరులో భాగంగా, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్‌లో 39వ ఓవర్లో ముఖేశ్ కుమార్ వేసిన బంతి ఆర్యన్ జుయ్ (46) బ్యాట్ అంచును తాకి.. వికెట్ కీపర్ కుమార కుషాగ్ర చేతుల్లోకి వెళ్లింది. అయితే, ఆన్ అంపైర్ మాత్రం 'నాటౌట్'గా ప్రకటించారు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ తొలుత రివ్యూ కోరాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. అయినప్పటికీ, సహచర ఆటగాళ్లతో చర్చించి.. టైమ్ ముగిసే సరిగ్గా మరో 3 సెకన్లు మాత్రమే ఉందనగా తన సొంత నిర్ణయంతో రివ్యూ కోరాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు.

ఆ తర్వాత అల్ట్రాఎడ్జ్ (UltraEdge) పరిశీలించగా.. బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఆర్యను ఔట్‌గా ప్రకటించాడు. 46 పరుగులు చేసి గట్టిగా క్రీజులో నిలదొక్కున్న ఆర్యన్ జుయ్ వెనుదిరగడంతో ఈస్ట్ జోన్ శిబిరంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతి చిన్న వయసులోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, కీలకమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న వైభవ్‌ను క్రికెట్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. భవిష్యత్తులో భారత క్రికెట్‌లో ఇతను ఒక పెద్ద సంచలనం కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

strong>

ఛాంపియన్స్ ట్రోఫీ: శ్రీలంక ఆతిథ్య హక్కులు తొలగించిన ఐసీసీ

గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా వ్యక్తిత్వమే మారిపోయింది: దీప్ దాస్‌గుప్తా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy