Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళ ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం!

కేరళ ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం!

తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్ కేసు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మెడకు బిగుస్తోంది. ప్రతిపక్ష యూడీఎఫ్ (కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి) సీఎంపై అవిశ్వాస పరీక్షకు సిద్ధమైంది. అంతే కాకుండా ముఖ్యమంత్రితో పాటు స్పీకర్ పి. రామకృష్ణన్ రాజీనామాను సైతం వారు లేవనెత్తనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్‌తో ప్రభుత్వానికి లింకులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

''ఈనాటి సమావేశంలో సీఎం, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం, వారి రాజీనామాలు డిమాండ్ చేయడం వంటి అంశాలపై యూడీఎఫ్ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది'' అని బెనెహన్ తెలిపారు.

''ముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు మా నిరసన కొనసాగిస్తూనే ఉంటాం.

ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని స్పష్టమైంది. ముఖ్యమంత్రికి కార్యదర్శిగా ఉన్న వ్యక్తి నిందితుల్లో ఒకరుగా ఉన్నారు'' అని యూడీఎఫ్ కన్వీనర్ ఆరోపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy