స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవీరో భారతలో పర్యటించింది. కేరళ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వి.డి.
సతీశన్ (V.D. Satheesan)తో భేటీ అయ్యారు. కోజికోడ్‌లో బాబీ చెమ్మనూర్ ఇంటర్నేషనల్ జ్యువెల్లర్స్ షోరూమ్ 'స్పార్కిల్ డైమండ్ ఫెస్ట్' కార్యక్రమానికి హాజరైన ఆమె.. అనంతరం సీఎంని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళ సీఎంతో దిగిన ఫొటోలను ఎల్మా స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. రొనాల్డోకు తాను పెద్ద అభిమానినని, కేరళంలో అతడికి భారీగా అభిమానులు ఉన్నారని ఎల్మాతో సతీశన్ తెలిపారు. కేరళలో ఫుట్‌బాల్‌కు ఇంత ఆదరణ ఉందన్న విషయం తనకు తెలియదని, తన సోదరుడు రొనాల్డోకు ఫ్యాన్ బేస్ ఉండడం సంతోషంగా ఉందని ఎల్మా పేర్కొంది. ఈ విషయాన్ని రొనాల్డోతో పంచుకుంటానని ఎల్మా అవీరో చెప్పుకొచ్చింది. అనంతరం సతీషన్‌ను.. 'సీఎం సార్.. ప్లీజ్ ఒక్క ఫొటో' అని ఎల్మా అడిగింది. దీనికి అంగీకరించిన కేరళ సీఎం సతీశన్ ఆమెతో ఫొటోలు దిగారు.
strong>

