హైదరాబాద్: కేసీఆర్ జన్మదినోత్సవాన్ని ప్రతి ఏటా రైతు దినోత్సవంగా జరపాలని వ్యవసాయశాఖ నిర్ణయించిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. కంది రైతులు ఆందోళన చెందవద్దని సీఎం చెప్పారన్నారు. కేంద్రం 47500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పిందని వెల్లడించారు. తెలంగాణలో 2లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అయిందని.. మిగిలిన కందిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. దళారులకు సహకరించే ఉద్యోగులను జైలుకు పంపుతామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్రం ఇచ్చాం.. రాష్ట్రం తీసుకుంది అనే విధానాన్ని ఖండిస్తున్నామన్నారు.