Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కేసీఆర్ జన్మదినాన్ని రైతు దినోత్సవంగా నిర్ణయించాం: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని ప్రతి ఏటా రైతు దినోత్సవంగా జరపాలని వ్యవసాయశాఖ నిర్ణయించిందని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. కంది రైతులు ఆందోళన చెందవద్దని సీఎం చెప్పారన్నారు. కేంద్రం 47500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పిందని వెల్లడించారు. తెలంగాణలో 2లక్షల మెట్రిక్‌ టన్నుల కంది ఉత్పత్తి అయిందని.. మిగిలిన కందిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు.

దళారులకు సహకరించే ఉద్యోగులను జైలుకు పంపుతామని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్రం ఇచ్చాం.. రాష్ట్రం తీసుకుంది అనే విధానాన్ని ఖండిస్తున్నామన్నారు.

కేంద్రం ఇచ్చేది కాదని.. పంపిణీ చేసే స్థానంలో మాత్రమే ఉందన్నారు. కేంద్రం ప్రత్యేకంగా సంపాదించి పెట్టేది లేదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం తిరోగమన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని అందించే పసుపు రైతులను ప్రోత్సహించకపోవడం తగదన్నారు. పసుపు బోర్డు బాధ్యత కేంద్రానిదేనని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy