నల్గొండ: రైతులతో కలిసి పోరాటం చేస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. సాగర్ ఎన్నికలప్పుడు కేసీఆర్ ఐకేపీ సెంటర్లు ప్రారంభిస్తామన్నారు.. రైతు పండించిన ప్రతీ గింజ కొంటామని చెప్పారన్నారు. ఎన్నికలు ముగియడంతో ఐకేపీ సెంటర్ల విషయం పట్టించుకోవట్లేదని తెలిపారు. ధాన్యం ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేయడం లేదో రైతులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రైతన్నలు ధాన్యం కొనుగోలుకు సర్కార్‌పై యుద్ధానికి సిద్ధం కావాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.

