ఖమ్మం: ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ సోమవారం ఖమ్మంలో పర్యటించారు. ఖమ్మం నూతన మేయర్, ఉప మేయర్‌ను కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం చాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు.

