Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కిక్కిరిసిన చైనా రహదారులు

జాతీయ సెలవుల్లో ఉత్సాహంగా చైనీయులు

బీజింగ్‌, అక్టోబరు 1: చైనాలో జాతీయ దినోత్సవ సెలవుల కారణంగా గురువారం లక్షలాది మంది ప్రజలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. కొవిడ్‌ భయాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలందరూ మాస్కులు ధరించి ఆనందంగా బయటకొచ్చారు. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా(పీఆర్‌సీ) 71వ వార్షికోత్సవం సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఎనిమిది రోజులపాటు జాతీయ సెలవులను ప్రకటించింది. దీంతో రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడాయి. జనవరిలో వూహాన్‌లో కరోనా వైరస్‌ బయటపడిన తరువాత చైనీయులకు తొలిసారిగా లభించిన అధిక సెలవులు ఇవే కావడంతో వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకోసాగారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది జనవరిలో చైనాలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy