Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోదాడ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. సీసీ ఫుటేజీలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

కోదాడ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. సీసీ ఫుటేజీలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

సూర్యాపేట, జులై 4: జిల్లాలోని కోదాడ పట్టణంలో సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించిన ఒక ఘటన వెనుక ఉన్న నమ్మలేని దారుణ నిజం సీసీ ఫుటేజీలో బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

గొడవ పడుతున్న ఇద్దరిని విడిపించిన పాపానికి చివరికి తన ప్రాణాలే పోగొట్టుకోవడం చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల 30న కోదాడలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో యాకూబ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మొదట అంతా దీనిని లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదంగానే భావించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరిపి, ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్‌తో జరిగిన హత్య అని తేలింది.

స్థానిక బార్‌లో మహేష్, రమేష్ అనే ఇద్దరు యువకులు మద్యం సేవిస్తూ గొడవ పడ్డారు. అక్కడే ఉన్న యాకూబ్ అనే వ్యక్తి మానవత్వంతో వారిద్దరినీ వారించడానికి ప్రయత్నించాడు. గొడవ సద్దుమణిగిన తర్వాత యాకూబ్ బార్ నుంచి బయటకు వచ్చి మేళ్లచెరువు రోడ్డు సిగ్నల్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే తన గొడవలో జోక్యం చేసుకున్నాడనే కోపంతో మహేష్ అనే యువకుడు యాకూబ్‌ను వెంబడించాడు. యాకూబ్ రోడ్డుపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన మహేష్ అతడిని కాలితో బలంగా తన్నాడు. దాంతో యాకూబ్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో పక్క నుంచి వెళ్తున్న లారీ చక్రాలు యాకూబ్ శరీరంపై నుంచి వెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ యాకూబ్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు మహేష్ తెలివిగా ఈ నేరాన్ని లారీ డ్రైవర్‌పైకి నెట్టేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కూడా ప్రాథమికంగా లారీ డ్రైవర్‌పైనే కేసు నమోదు చేసే దిశగా ఆలోచించారు. కానీ, సంఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో మహేష్ చేసిన ఘాతుకం స్పష్టంగా రికార్డయ్యింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


రెడీమేడ్ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీ..ఒకే ట్రిప్‌లో 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy