చిత్తూరు జిల్లా/కలికిరి : డ్వాక్రా సంఘాల్లో జరిగిన లావాదేవీలపై 27 రోజులుగా చేపట్టిన తనిఖీలు మంగళవారానికి కొలిక్కి వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగుల నిర్వాకంతో మొత్తం రూ.
స్పందించిన డీఆర్‌డీఏ పీడీ తులసి..
కలికిరి డ్వాక్రా గూపుల్లో వెల్లడవు తున్న అక్రమాలు రూ.కోట్లకు చేరుకుంటున్నా డీఆర్‌డీఏ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మంగళవారం 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన మహిళా సంఘాల ఆగ్రహావేదనల వార్తపై గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ డీఎంకే తులసి స్పందించారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాలున్న 232 సంఘాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులైన వారిని గుర్తించేందుకు జిల్లా ఐబీ, ఫైనాన్స్ విభాగాల ఆధ్వర్యంలో 12 మంది (సీసీలు, డీఎంజీలు)తో తనిఖీలు చేయడానికి గత నెల 18న విచారణ కమిటీలను నియమించినట్లు పేర్కొన్నారు. బీవోబీలో 232 సంఘాలు, 11 గ్రామ సమాఖ్యలతోపాటు మండల మహిళా సమాఖ్యకు చెందిన ఖాతాలు న్నాయని వెల్లడించారు. బీవోబీ ఉద్యోగులు జరిపిన నిధుల దుర్వినియోగంపై ఎల్‌డీఎంతో చర్చించడం జరిగిందని తెలిపారు. విచారణ పూర్తయి తుది నివేదిక అందిన అనంతరం బాధిత స్వయం సహాయక సంఘాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే చర్యలకు ముందు వ్యవస్థీకృత లోపాలపై తమ వాదనలు కూడా పీడీ ఆలకించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.
మొత్తానికి స్వాహా జరిగింది ఎంత?
డ్వాక్రా గూపులకు సంబంధించి రూ. 2.37 కోట్లు పక్కదారి పట్టినట్లు తేలినా మొత్తం బ్యాంకులో జరిగిన అక్రమాల మొత్తం ఎంత అనేది ఇప్పటికీ స్పష్టం కావడం లేదు.వ్యక్తిగత ఖాతాలకు సంబంధించి డిపాజిట్లలో నగదు గల్లంతు, బంగారు, పంట రుణాలకు చెల్లించినవి జమ కాకపోవడం వంటి అంశాల్లో దాదాపు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు రుజువయ్యాయి. ఇక డమ్మీ గ్రూపులను సృష్టించి, బినామీ గ్రూపుల పేర్లు, అకౌంట్లు మార్చి దోచుకున్నది మరో రూ. 50 లక్షలుగా వెల్లడయ్యింది. ఇవన్నీ కలిపి దాదాపు రూ. 3 కోట్లు దాటిపోయిందని లెక్క తేలుతోంది. ఇవి కాకుండా బ్యాంకు అధికారులకు నేరుగా అందిన ఫిర్యాదుల మొత్తం ఎంత అన్నది కూడా తేలాల్సి వుంది.

