Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక వద్ద సీఎన్‌జీ గ్యాస్ లీక్ అయింది.

ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ పాయింట్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయింది. మూసివేసిన వెల్ నుంచి రీ డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్దంతో గ్యాస్ వెలువడింది. దీనితో పాటు భారీ శబ్దాలు వచ్చాయి. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని ఓఎన్జీసీ నిపుణులు చర్యలు చేపట్టారు.

ఈ ఏడాది జనవరి 5వ తేదీన మలికిపురం మండలం ఇరుసుమండలో భారీ బ్లో అవుట్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే తరహాలోనే మామిడి కుదురులో భారీ బ్లో అవుట్ సంభవించింది. ఈ ఘటనతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తరచూ గ్యాస్ లీక్‌లు జరుగుతున్న ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.

బ్లో అవుట్‌ను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని వెంటనే అదుపు చేసి రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. 2014లో నగరంలో పైపులైన్ నుంచి గ్యాస్ లీకై భారీ విస్ఫోటనం సంభవించి 22 మంది మృతిచెందిన ఘటనను పరిసర గ్రామాల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని ఓఎన్జీసీ అధికారులతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్, ఎస్పీలు మాట్లాడుతున్నారు. గ్యాస్‌ను అదుపు చేసేందుకు నరసాపురం నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి ఓఎన్‌జీసీ అధికారులు తీసుకువస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy