రంగూన్ : కొండచరియలు విరిగిపడడంతో మయన్మార్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సుమారు 113 మంది మృతి చెందినట్లు సమాచారం. భారీ వర్షాలే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
కాచిన్ రాష్ట్రం జాడేరిచ్ హవకాంత్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల నేపధ్యంలో... ఓ సరస్సులోని నీరు ఉప్పొంగి సమీపంలోని గనులను ముంచెత్తినట్లు అధికారులు వెల్లడించారు.
కాచిన్ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ళ క్రితం కూడా జరిగిన ఇటువంటి ప్రమాదంలో... వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

