Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ

కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడాలో కొండచిలువలు అడవి కుందేళ్లను తరచూ వేటాడతాయి. అయితే టెక్నాలజీ పుణ్యమా అని అక్కడి కథ తారుమారైంది. ఇకపై కుందేళ్లే కొండచిలువలను వేటాడతాయి.

ఎలా అంటారా? అవి రోబో కుందేళ్లు కాబట్టి.

కొన్ని సంవత్సరాలుగా ఫ్లోరిడాలో బర్మీస్ అనే కొండచిలువల జనాభా భారీగా పెరిగిపోతోంది. ఈ బెడద నుంచి తప్పించుకోవడానికి అక్కడి ప్రభుత్వం టెక్నాలజీకి ఓటు వేసింది. బర్మీస్ కొండచిలువలకు అడవి కుందేళ్లంటే మహాఇష్టం. అందుకే వాటిని పోలి ఉన్న రోబో కుందేళ్లను పరిశోధకులు ఆవిష్కరించారు. వాటికి 'రోబో-బన్నీలు' అని పేరు కూడా పెట్టారు. వీటిని తీసుకెళ్లి అడవిలో ఉంచారు.

ఈ రోబో బన్నీలు నిజమైన జంతువుల మాదిరిగానే కదలికలు , శరీర ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి. అప్పుడప్పుడు ఇవి వాసనలను, ప్రకంపనలను కూడా విడుదల చేస్తాయి. వీటిని చూసి, నిజమైన కుందేళ్లే అని భావించిన కొండచిలువలకు నోరూరకమానదు. ఇంకేముంది తినడానికి కొండచిలువలు ముందుకొస్తాయి. సరిగ్గా అప్పుడే రోబో బన్నీలు తన ఏఐ కెమెరాలకు పని చెబుతాయి. అవి ఓ ఫోటోని క్లిక్‌మనిపించి, అధికారులకు లొకేషన్‌తో సహా పంపుతాయి. సమాచారం అందుకున్న వారు కొండచిలువలను పట్టుకుంటారు.

ఈ రోబో కుందేళ్లు సౌరశక్తి ద్వారా పనిచేస్తాయి. ఇలాంటి రోబో ఒకటి తయారు చేయాలంటే దాదాపు నాలుగు లక్షల రూపాయల ఖర్చవుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రయోగదశలో ఉంది. ఫ్లోరిడాలో కొండచిలువల బెడద విపరీతంగా పెరిగిపోయింది. ఈ సమస్య పరిష్కారం కోసం అక్కడి అధికారులు టెక్నాలజీ బాటపట్టారు.

ఈ వార్తలూ చదవండి

ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక

నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy