Friday, 23 Apr, 2.16 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
కోరలు చాస్తున్న కరోనా.. ఆస్పత్రులు ఫుల్‌!

కరోనా బాధితులతో నిండిన జిల్లా ఆస్పత్రులు

ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్యాకేజీల పేరిట రూ.లక్షల్లో వసూలు

ఆక్సిజన్‌, బెడ్స్‌ కోసం నేతల సిఫారసులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నిజామాబాద్‌లో ఏ ఆ సుపత్రి చూసినా కరోనా బాధితులే. దీనితీవ్రత పెరగడం తో చికిత్స కోసం వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి అనే తేడాను చూడడం లేదు. ఏ దవాఖానలో ఖాళీ పడకలు ఉంటే అక్కడ చేరుతున్నా రు. ఆక్సిజన్‌, బెడ్స్‌కు డిమాండ్‌ ఉండడంతో నేతల సిఫారసులు చేయించు కుంటున్నారు. ప్రైవేటులో ఎంత ఫీజులు వసూలు ఉన్నా అప్పులు చేసి మరీ వైద్యం కోసం వెచ్చిస్తున్నారు. తమ ప్రాణాలను నిలుపుకునేందుకు తి ప్పలు పడుతున్నారు. ఇదే సమయం అనుకొని కొన్ని ఆస్పత్రుల్లో పలు రకాల కారణాలు చెప్పి హైదరాబాద్‌ కార్పొరేటు లాగానే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. మరికొన్ని రోజువారి ప్యాకేజీలు పెట్టి తీసు కుంటున్నారు. ఆస్పత్రుల్లో చేరిన వా రిలో చికిత్స పొంది 95 శాతానికి పైగా బయట పడుతుండగా మిగతా వారు ఇ బ్బందులను ఎదుర్కొంటున్నారు.

48 ప్రైవేటుకు అనుమతులు..

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు నిండిపోవడంతో 48 ప్రైవేటు దవాఖానలకు ఇప్పటి వరకు అనుమతులు ఇచ్చారు. నాలుగు బెడ్స్‌ ఉన్న చిన్న వాటి నుంచి 40 బెడ్స్‌ ఉన్న వాటికి అవకాశం ఇచ్చారు. వీటిలో పదిహేను రోజులుగా కరోనా వచ్చిన వారిని చేర్చకుంటున్నారు. కొ న్నింటిలో అనుమతులకు ముందే చేర్చుకొని తర్వాత తీసుకున్నారు. జిల్లాలోని ఏ ప్రైవేటు ఆసుపత్రిలోనూ ప్రభుత్వ ఫీజులు వసూలు చే యడం లేదు. ప్రత్యేక ఫీజులను వ సూళ్లను చేస్తున్నారు. కొన్నింట్లో రోజు కూ రూ.30 వేల వరకు వసూలు చే స్తున్నారు. మరికొన్ని దాంట్లో ఇరవై వేల వరకు తీసుకుంటున్నారు. వా రం రోజులకు లక్ష రూపాయల నుం చి లక్షన్నర వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. వెంటిలేటర్‌, రెమ్‌డెసివి ర్‌ మందులు అవసరం అయిన వా రికి ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నా రు. ఎవరైనా అడిగితే వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితు లలో అప్పులు చేసి ఫీజులను కడు తున్నారు. వైద్యఆరోగ్య శాఖ అధికా రులు వీటిపై నిఘా పెడితే ఫీజులు కొంతమేర తగ్గనున్నాయి. వారు ఇత ర పనులలో ఉండి పట్టించుకోకపోవ డంతో సమస్యలు ఎదురవుతున్నా యి. నిపుణులు అయినా వైద్యులు మాత్రం సీరియస్‌గా ఉంటేనే చేరాలని కోరుతున్నారు. కరోనా వచ్చిన వారిలో 95 శాతానికి పైగా ఇంటి వద్ద ఉండి మందులు వాడితే త గ్గుతుందని చెబుతున్నారు. భయపడకుండా వైద్యులు సూచించిన వి ధంగా మందులు వేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువత అనవసరంగా బయట తిరగవద్దని సూచిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని సూచించారు.

నిండిన దవాఖానాలు..

నిజామాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్‌ కరో నా బాధితులతో నిండిపోయాయి. కరోనా తీవ్రత ఉండడంతో అన్ని ఆస్పత్రుల్లో సాధారణ బాధితులను తగ్గించారు. కరోనా వచ్చిన వారికే చికి త్స అందిస్తున్నారు. ప్రసవాలు, ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ఇతరులను అ నుమతించడం లేదు. వైద్యులు ఆసుపత్రికి వచ్చేవారిని చూడడంతో పాటు ఇంటివద్ద ఉండే వారికి కూడా వైద్యసేవలు అందిస్తున్నారు. వారికి అవసరం అయినా మందులు, ఇతర పరికరాలను పంపిస్తున్నారు. వారం రోజులుగా ఖలీల్‌వాడీ, ప్రగతినగర్‌, ఇతర కాలనీలో ఉన్న ఏ ఆసుపత్రిలో ఉన్నా బెడ్స్‌ ఖాళీగా లేవు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కరోనా వచ్చిన బాధితులే అక్కడ వచ్చి చేరుతున్నారు.

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 500 బెడ్లు..

జిల్లాలో కేసులు పెరగడంతో ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 270 నుంచి 500 వరకు పెంచగా, వాటి కూడా నిండిపోయాయి. సీరియస్‌గా ఉన్న వారిని పరిశీలించి ఇందులో చేర్చుకుంటున్నారు. బోధన్‌, ఆర్మూర్‌లో 100 చొప్పున పడకలను పెంచారు. వీటితో పాటు జిల్లాలో కరోనా వచ్చిన వారి కోసం నాలుగు క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో కూడా వంద మంది వరకు ఉన్నారు. జిల్లాలోని ఈ ఆస్పత్రుల్లో అన్ని బెడ్స్‌కు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించారు. మందులు అందుబాటులో ఉంచారు. అవసరం అయిన వారికి రెమ్‌డెసివిర్‌ ఇతర మందులను ఉచితంగానే అం దిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉం డి చికిత్స అందే విధంగా చూస్తున్నారు.

ఆక్సిజన్‌, బెడ్స్‌కు పెరిగిన డిమాండ్‌..

జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో అక్సిజన్‌, బెడ్స్‌కు డిమాండ్‌ పెరిగింది. కొన్నిం ట్లో పైరవీ ఉంటే తప్ప బెడ్స్‌ దొరకడం లేదు. మరికొన్ని ఆర్‌ఎంపీలకు రిజ ర్వ్‌ చేసి పెట్టారు. వారు యజమానులతో ఒప్పందాలు చేసుకొని గ్రామాల నుంచి రోగులను తీసుకు వస్తుండడంతో ఇస్తున్నారు. కొన్ని పెద్ద దవాఖాన ల్లో ప్రజాప్రతినిధులు పంపే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతరులు సీరి యస్‌గా ఉన్నా ఆక్సిజన్‌, బెడ్స్‌ లేవని ఇతర పడకలు ఉన్నాయని చెప్పి చే ర్చుకుంటున్నారు. మరికొన్ని దానిలో తిప్పి పంపుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఒక మెడికల్‌ కంపెనీలో సెల్స్‌ మేనేజర్‌గా పని చేస్తూ వైద్యులతో సం బంధాలు ఉన్న ఆయన తన తల్లికి కరోనా వచ్చి ఆక్సిజన్‌ బెడ్‌ కోసం ప్ర యత్నం చేశారు. ఏ ఆసుపత్రిలోనూ బెడ్స్‌ లేవని చేర్చుకోలేదు. మరో ఆసు పత్రి కోసం తిరుగుతుండగానే అంబు లెన్సులోనే మృతి చెందింది. ఇదే పరిస్థి తి ఒక గ్రామానికి చెందిన యువ స ర్పంచ్‌కు ఎదురైంది. కరోనా వచ్చి వా రం రోజుల పాటు చికిత్స పొందిన ఆ యన పరిస్థితి సీరియస్‌ అయ్యింది. ఆ యనకు వెంటిలేటర్‌ అవసరం అయి పలు ఆసుపత్రులు వెతికినా దొరకలే దు. చివరకు ఆ నియోజకవర్గ ఎమ్మె ల్యే జోక్యంతో వెంటిలేటర్‌ దొరికింది. అ క్కడికి తరలించి చికిత్స అందించే లో పే మృతిచెందాడు. ఇదే పరిస్థితి కొన్ని రో జులుగా చాలా మంది కరోనా రో గులకు ఎదురవుతుంది. పైరవీలు ఉంటే తప్ప బెడ్స్‌ దొరకడం లేదు. ఎమ్మె ల్యేలు, మంత్రులతో పైరవీలు చేసుకొని హైదరాబాద్‌కు వెళ్తున్నారు.

శ్వాస సమస్యలు, ఆక్సిజన్‌ శాతం తగ్గితేనే చేరాలి

డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ (పల్మానాలోజిస్టు)

కరోనా వచ్చిన వారందరూ చికిత్స కోసం ఆందోళన చెందవద్దు. ఆక్సిజన్‌ శాతం 94 కన్నా తగ్గడం, శ్వాస సమస్యలు ఏర్పడితేనే చేరాలి. ఆందోళన చెందకుండా వైద్యులు సూచించిన మందులను వాడితే సరిపోతుంది.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి

డాక్టర్‌ బాల నరేంద్ర (జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి)

ప్రైవేటు ఆసుపత్రుల యజమాన్యాలు కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ణ యించిన ఫీజులనే వసూలు చేయాలి. కరోనా వచ్చిన వారికి మనోధైర్యం నింపేవిధంగా చికిత్స అందించాలి. ఎవరైనా ఎక్కువగా వసూలు చేస్తే చర్య లు తీసుకుంటాం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy

related stories

Top