కోసిగి, జనవరి 27: స్థానిక ఏపీజీ బ్యాంకు సమీపంలోని దాస సుజాత, దాస రాజు ఇంట్లో చోరీ జరిగింది. బాధితుల కథనం మేరకు.. శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులంతా తిరుపతికి వెళ్లారు. బుధవారం కోసిగికి తిరిగి వచ్చారు. వారికి ఇంటి తాళాలు పగులకొట్టి కనిపించాయి. బట్టలు, సామగ్రి చిందరవందరగా పడి వున్నాయి. పెట్టెలోని రూ.1.50లక్షల నగదు, 4 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఫిర్యాదు మేరకు పోలీసు పోలీసులు చేరుకుని సమాచారాన్ని సేకరించి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
