జెనీవా, అక్టోబరు 18 : భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కొవాక్సిన్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు (ఈయూఎల్) లభించాలని చాలామంది కోరుకుంటున్న విషయం తమకు తెలుసని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది.
వేర్వేరు టీకాలతో బలమైన రక్షణ
మొదటి డోసు కొవిషీల్డ్ టీకా, రెండో డోసు ఏదైనా ఒక ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ ముప్పు తక్కువని స్వీడన్‌లో నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. రెండు డోసులూ కొవిషీల్డ్ తీసుకున్న వారితో పోలిస్తే .. ఈవిధంగా చెరో రకం టీకా డోసును వేయించుకున్న వారికి వైరస్ నుంచి బలమైన రక్షణ లభిస్తున్నట్లు గుర్తించారు.
