తెలంగాణ తాజావార్తలు
కొవిడ్ నిబంధనలతో గణతంత్ర వేడుకలు

భువనగిరి రూరల్, జనవరి 23: కొవిడ్ నిబంధనలను పాటించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. ఈనెల 26న నిర్వహించే వేడుకల ఏర్పాట్లను కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం ఆమె పరిశీలించారు. కొవిడ్ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై శకటాలు, స్టాళ్లు ఏర్పాట్లు నిలిపివేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ త్రివర్ణ పతాకాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమె వెంట కలెక్టరేట్ కార్యాలయ ఏవో నాగేశ్వరచారి తదితరులు ఉన్నారు.
జాతీయ ఓటరు దినోత్సవం
ఈనెల25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఓటరు దినోత్సవం ప్రతిజ్ఞ చేస్తారు. జిల్లాలోని అధికారులందరూ 25వ తేదీన ఉదయం 10.30గంటలకు ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞలో పాల్గొనాలని కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశాలు జారీచేశారు. అనంతరం నూతన ఓటర్లకు ఓటరు ఐడీ కార్డులు అందజేయనున్నారు.