Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతంలో సీఐ నాగరాజుపై  మరో కేసు

క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతంలో సీఐ నాగరాజుపై మరో కేసు

విజయవాడ, జులై 7: నగరంలోని కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై మరో కేసు నమోదైంది. పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య ఉదంతంలో సస్పెండెడ్ అయిన సీఐ నాగరాజు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.

ఈ కేసులో సీఐ నాగరాజుపై పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆయనపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అదనంగా కొత్త సెక్షన్లను చేర్చారు.

క్రాంతికుమార్ బలవన్మరణానికి పాల్పడే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఈ కేసులో అత్యంత కీలకమలుపుగా మారింది. 'నా ఆత్మహత్యకు సీఐ నాగరాజే కారణం' అంటూ క్రాంతికుమార్ ఆ వీడియోలో స్పష్టంగా పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసులు క్రాంతికుమార్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ కీలక సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.


నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్

పొలంలో బాలికల డ్యాన్స్.. నెటిజన్ల హృదయాలను దోచుకున్న వీడియో వైరల్

For More Viral News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy