Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రెడిట్ చోరీ వ్యాధికి మొదటి రోగి జగన్: మంత్రి గుమ్మడి సంధ్యారాణి

క్రెడిట్ చోరీ వ్యాధికి మొదటి రోగి జగన్: మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మరావతి, సెప్టెంబర్ 3: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్‌కు క్రెడిట్ చోరీ వ్యాధి బాగా ముదిరిపోయిందని..

వైద్యుడు కూడా లేని ఇలాంటి వ్యాధికి మొదటి రోగి జగనే అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసినా, ఉదయం అవినీతి జరిగిందని... సాయంత్రం తన ఘనతని చెప్పుకుంటున్నారంటూ జగన్‌పై విరుచుకుపడ్డారు. మందుల డోస్ అయినా పెంచాలి లేదా, మాట్లాడటమైనా మానేస్తే ఆయనకే మంచిదంటూ హితవుపలికారు. రైతులు, మహిళలు పాలాభిషేకాలు, పాదాభివందనాలు చేస్తుంటే క్రెడిట్ చోరీ అని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

వెలిగొండ, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం, గూగుల్ ఇలా ప్రతిదీ తన ఘనతగా జగన్ చెప్పుకోవటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. 'జగన్‌కు ఉన్న క్రెడిట్ ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడం, తాకట్టు పెట్టడం, విధ్వంసం చేయటమే. అలాంటి క్రెడిట్‌లు కూటమి ప్రభుత్వానికి పొరపాటున కూడా అక్కర్లేదు. క్రెడిట్ చోరీ ఒక రాజకీయ జబ్బుగా మారింది.. దానికి మందు ప్రజలే వేస్తారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు.. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. అభివృద్ధి చేయడం చేతకాకపోతే కనీసం చేసిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వండి' అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హితవుపలికారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy