Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరాలయం

కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరాలయం

శ్రీశైలానికి భారీగా కొనసాగుతున్న వరద

జూరాల నుంచి 2,44,998 క్యూసెక్కులు విడుదల

కొత్తపల్లి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణాపూర్‌, జూరాల ప్రాజెక్టులు నిండి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో సంగమేశ్వర ఆలయం పూర్తిగా జలాధివాసమైంది.

మరలా 8 నెలల తర్వాతనే సంగమేశ్వర దర్శనం కలుగుతుంది. ఈ ఏడాది మార్చి 22న నీట నుంచి బయల్బడిన సంగమేశ్వరాలయం 131 రోజులు భక్తులచే పూజలందుకుని నేడు నదీ గర్భంలో నిక్షిప్తమైంది. చివరిసారిగా భక్తులు ఎగువ ఉమామహేశ్వరం ఒడ్డున నదీ జలాలకు పూజలు చేసి జల హారతులు ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy