- పెరియార్‌పై వ్యాఖ్యలను సమర్థించుకున్న సూపర్‌స్టార్
చెన్నై, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ 1971లో దేవతా విగ్రహాలను అవమానించారంటూ ఈ నెల 14న తుగ్లక్ మేగజైన్ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై డీఎంకే, ద్రవిడ కళగం, తందై పెరియార్ ద్రవిడ కళగం, ఎండీఎంకే తదితర పార్టీల మండిపాటు నేపథ్యంలో రజనీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
వార్తా పత్రికలు, మేగజైన్ల క్లిప్పింగులను విలేకరులకు చూపించారు. 'జరిగిందే చెప్పాను. నేను విన్నది, మేగజైన్లలో చూసినదే మాట్లాడాను.
కాగా.. పెరియార్‌పై విమర్శలు చేసేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని రజనీకి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సూచించారు. రజనీ వ్యాఖ్యలకు కట్టుబడితే, కోర్టులో ఆయనకు తాను మద్దతుగా నిలబడతానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.

