Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూకట్‌పల్లి జేఎన్టీయూ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

కూకట్‌పల్లి జేఎన్టీయూ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 04: కూకట్‌పల్లి జేఎన్టీయూ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు హల్‌చల్ చేశారు. గురువారం అర్ధరాత్రి కాలేజీ క్యాంపస్‌లోని గౌతమి, మంజీర హాస్టల్ విద్యార్థులు ఒకరినొకరు తన్నుకున్నారు.

విచక్షణారహితంగా దాడులు చేసుకోవడంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్‌లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీనిపై కాలేజీ ప్రిన్సిపాల్‌కు హాస్టల్ సిబ్బంది సమాచారం అందించారు. ప్రిన్సిపాల్‌ వెంటనే హాస్టల్‌కు చేరుకుని.. విద్యార్థులను నిలువరించారు. అనంతరం గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

గురువారం కాలేజీ హాస్టల్‌లో తీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హాస్టల్‌లోని రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో గత అర్ధరాత్రి ఆ వర్గాల మధ్య మాటా మాటా పెరిగి.. ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. విద్యార్థుల మధ్య ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాన్ని విద్యార్థులు కోరుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సాగర్‌ ఆయకట్టుకు నీరివ్వకుంటే ..14 నుంచి పాదయాత్ర

ప్రియురాలికి ఐఫోన్‌ కొనిచ్చేందుకు గంజాయి రవాణా

For More TG News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy