Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కుల్దీప్‌ యాదవ్‌ గైర్హాజరీపై క్లారిటీ ఇచ్చిన కోటక్!

కుల్దీప్‌ యాదవ్‌ గైర్హాజరీపై క్లారిటీ ఇచ్చిన కోటక్!

స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుకు భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడు. అయితే అతడి గైర్హాజరీపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ క్లారిటీ ఇచ్చాడు.

ఆరోగ్య సమస్య వల్లే రెండో టెస్టుకు కుల్దీప్ దూరమయ్యాడని కోటక్ స్పష్టం చేశాడు. మ్యాచ్‌కు ముందు కుల్దీప్ ఫిట్‌నెస్, గైర్హాజరీపై పలు ఊహాగానాలు రాగా.. కోటక్ వాటిని ఖండించాడు. యాదవ్‌ను తుది జట్టు నుంచి తప్పించడానికి మేనేజ్‌మెంట్ ఎలాంటి అనవసర నాటకాలు ఆడాల్సిన అవసరం లేదన్నాడు. గాలేలో ఉన్నప్పుడే అతనికి తీవ్రమైన వైరల్ జ్వరం సోకిందని కోటక్ వెల్లడించాడు.

కులదీప్ రెండు రోజులుగా నెట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండటానికి అధికంగా ప్రయాణం చేసి విశ్రాంతి లేకపోవడం కారణమని బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే గతంలో పేర్కొన్నాడు. తాజాగా కోటక్ మాటలు దానికి భిన్నంగా ఉండటం గమనార్హం. 'కుల్దీకి ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆడటం గురించి ఆలోచించడంలో అర్థం లేదు. లంక జట్టులో నలుగురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండటం, కులదీప్ అందుబాటులో లేకపోవడంతోనే మేం ఆఫ్‌స్పిన్నర్ సారాంశ్ జైన్‌కు అరంగేట్రం అవకాశం కల్పించాం' అని కోటక్ వివరించాడు. ప్రస్తుతం కులదీప్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆయన తెలిపాడు.

రెండో టెస్టులో వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్‌కు మరోసారి గాయమైంది. శ్రీలంక పేసర్ లహిరు కుమార వేసిన బంతి పంత్ ఎడమ చేతి ముంజేతికి బలంగా తాకింది. నొప్పితో అల్లాడిన పంత్ కేవలం 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. దీనిపై స్పందించిన కోటక్, పంత్ కోలుకుంటున్నాడని, రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశాడు.

/span>

భర్తను చంపేసి పేగులను బయటకు తీసి.. హర్యానాలో ఓ మహిళ దారుణం..

స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy