అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండీసీకి (APMDC) అదనంగా రూ.115 కోట్ల ప్రభుత్వ గ్యారెంటీని మంజూరు చేసింది.
మొత్తం క్రెడిట్ సదుపాయం పరిమితి రూ. 906.52 కోట్ల నుంచి రూ. 1,021.52 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు వీలుగానే ఈ రుణపరిమితిని పెంచింది.
తీసుకునే రుణం అసలు, వడ్డీ రెండింటికీ ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుందని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తన సొంత వనరులతోనే రుణాన్ని తిరిగి చెల్లించాలని ఏపీ ఎండీసీకి రాష్ట్ర సర్కార్ షరతు విధించింది. అదనపు గ్యారెంటీ మొత్తంలో 5% కమిషన్ను ప్రభుత్వానికి చెల్లించాలని నిబంధన పెట్టింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ - 279 ద్వారా పరిశ్రమలు, వాణిజ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ సమ్మతితోనే ఈ తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఎం చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..

