న్యూఢిల్లీ, అక్టోబరు 1: కువైట్ రాజు షేక్ సబా అల్ అహ్మద్ సబా మృతికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఈనెల 4న సంతాప దినంగా ప్రకటించింది. ఆరోజు దేశమంతా సంతాప దినాన్ని పాటించాలని, ఎటువంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొంది. అలాగే జాతీయ జెండాను ఎగరేసే అన్ని చోట్లా ఆరోజు జెండాను అవనతం చేయాలని సూచించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. సెప్టెంబరు 29న షేక్ సబా కన్నుమూసిన విషయం తెలిసిందే.
