Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్యాన్సర్‌ను నయం చేసే ఏఐ.. త్వరలో రానుందా..?

క్యాన్సర్‌ను నయం చేసే ఏఐ.. త్వరలో రానుందా..?

ఇంటర్నెట్ డెస్క్: క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వణికిపోతాం. తెలిసిన వాళ్లు దాని బారినపడినా తట్టుకోలేం. ఒక్కసారి ఈ రోగం వస్తే నిత్యం దానితో పోరాడాలి.

అయితే వచ్చే పదేళ్లలో క్యాన్సర్‌ను క్యూర్ చేయడానికి ఏఐ రంగంలోకి దిగబోతోందనే మాట గట్టిగా వినిపిస్తోంది. భవిష్యత్తులో ఏఐ ఎలాంటి క్యాన్సర్‌నైనా సమూలంగా నయం చేయగలదనే చర్చ టెక్ వర్గాల్లో సాగుతోంది.

స్కిన్ క్యాన్సర్‌ కణాలను అంతమొందించే వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి రిసెర్చర్స్‌కు ఏఐ సహకరించిందనే వార్తలు కూడా ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇప్పుడు కేవలం వ్యాక్సిన్ తయారీలో సహాయం చేసిన ఏఐ 5 నుంచి 10 సంవత్సరాల్లో క్యాన్సర్‌ను క్యూర్ కూడా చేస్తుందని ఏఐ రిసెర్చర్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో కొంత నిజం లేకపోలేదు. ఈ క్రమంలో త్వరలో ఏఐ అన్ని జబ్బులనూ నయం చేస్తుందని, క్యాన్సర్‌ను క్యూర్ చేసే సామర్థ్యం సంపాదిస్తుందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ వివరిస్తున్నారు. ప్రతి జబ్బుకీ ఏఐ మందు కనిపెట్టితీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

'నాకు తెలిసి ఇంకో పదేళ్లలో మనకున్న అన్ని జబ్బులనూ ఏఐ క్యూర్ చేస్తుంది. ఇది మామూలు మనుషులకే కాదు, బయోలజిస్టులకు కూడా విచిత్రంగానే ఉంటుంది. అయితే నా బాధేంటంటే ఏఐ త్వరగా చికిత్స నేర్చుకుంటే బావుండు' అని డారియో చెప్పారు. ఆయన చెప్పినదాన్ని చాలామంది అంగీకరించారు. ఎలాన్ మస్క్ కూడా డారియో మాటలను సమర్థించారు. 'ఏఐ ఆ పని కచ్చితంగా చేయగలదు' అంటూ పోస్ట్ చేశారు. నోబుల్ ప్రైజ్ గ్రహీత డెమిస్ హసబిస్ కూడా ఇదే మాటలు పలికారు. అన్ని జబ్బులూ ఏఐ పుణ్యాన నయమవుతాయని చెప్పుకొచ్చారు.

వైద్య నిపుణుల మాట..

టెక్ వర్గాలో ఏఐ క్యాన్సర్‌ను నయం చేయగలదని జరుగుతున్న చర్చలపై వైద్య నిపుణులు స్పందించారు. ఏఐ వైద్య రంగంలో ఎన్నో మార్పులు తెస్తుందని కానీ క్యాన్సర్‌ను నయం చేసే సామర్థ్యం దానికి ఈ 10 పదేళ్లలో రాదని వారు అంటున్నారు. 'మెడికల్ సైన్స్‌లో ఏఐ అద్భుతాలు చేయగలదు. ఎందుకంటే బయోలజికల్ డెటాను అది అర్థం చేసుకున్నట్టు మనుషులు అర్థం చేసుకోలేరు. అయినప్పటికీ వచ్చే 5 నుంచి 10 పదేళ్లో ఏఐ క్యాన్సర్‌ను నయం అవకాశం లేదు' అని ఆంకాలజిస్ట్ డాక్టర్ గర్విత్ వివరించారు. డాక్టర్ సందీప్ నాయక్ దీనిపై స్పందిస్తూ.. ' ఏఐ పరిష్కరించే సమస్యలకు, బయోలాజికల్ సమస్యలకు చాలా వ్యత్యాసముంది' అన్నారు. అప్పుడే ఏఐకు జబ్బులు నయం చేసే సామర్థ్యం రాదని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy