Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లఖ్‌నవూ చేతిలో ఓటమి తర్వాత సహచరులకు రుతురాజ్ బిగ్ మెసేజ్

లఖ్‌నవూ చేతిలో ఓటమి తర్వాత సహచరులకు రుతురాజ్ బిగ్ మెసేజ్

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది.

ఇక ఎస్ఎస్‌జీ చేతిలో ఓటమిపై సీఎస్కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ స్పందించాడు. పేసర్ల నుంచి తాను మెరుగైన ప్రదర్శన ఆశించానని.. కానీ వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారని తెలిపాడు. తమ ఓటమికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు.

ఓటమి అనంతరం రుతురాజ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ.. 'మేము బ్యాటింగ్‌ చేసినపుడు పిచ్ కఠినంగా ఉంది. ఈ పరిస్థితులను ప్రత్యర్థి జట్టు బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. మేము 160- 170 పరుగులే చేస్తామనుకున్నా. అయితే 180 స్కోరు దాటగలిగాం. బ్యాటింగ్‌ పరంగా మా తప్పేమీ లేదు. లఖ్‌నవూ బ్యాటర్లు కూడా గొప్పగా ఆడారు. ఈ పిచ్ మీద ఫాస్ట్‌ బౌలర్ల సత్తాచాటుతారని భావించాను. కానీ వారు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. బౌలింగ్‌లో మా వ్యూహాలను పక్కాగా అమలు చేయలేకపోయాము' అని తెలిపాడు.

'మ్యాచ్ ఫలితం ఎలా ఉన్న ప్రత్యర్థి జట్టు మనకన్నా గొప్పగా ఆడినపుడు ఆ నిజాన్ని అంగీకరించాలి. మేము కూడా ఇంకాస్త పట్టుదలగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. ప్లేఆఫ్ కు చేరడం సులభమే. ఇందులో సంక్లిష్టమైనదేమీ లేదు. ఆందోళన పడాల్సిన పనిలేదు. తదుపరి మ్యాచుల్లో మనం బాగా ఆడి, పరిస్థితులను చక్కదిద్దుకుంటామని ఆశిస్తే చాలు' అని సహచరులకు రుతురాజ్ సందేశం ఇచ్చాడు. మ్యాచ్ విషయానికి వస్తే... టాస్‌ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన లఖ్‌నవూ కేవలం 16.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy