Dailyhunt
లెఫ్ట్, కాంగ్రెస్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

లెఫ్ట్, కాంగ్రెస్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం

కోల్‌కతా : ఎట్టకేలకు కాంగ్రెస్, లెఫ్ట్ మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 294 సీట్లకు గాను 101 సీట్లలో లెఫ్ట్, 92 సీట్లలో కాంగ్రెస్ పోటీలో దిగనుంది. మిగితా 101 సీట్ల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవడంలో కాస్త సమయం పడుతుందని ఇరు వర్గాలు పేర్కొన్నాయి. గురువారం కాంగ్రెస్ కార్యాలయంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు భేటీ అయ్యారు. లెఫ్ట్ నుంచి లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బోస్ హాజరయ్యారు. తృణమూల్, బీజేపీని ఓడించడానికి తాము బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతామని బిమన్ బోస్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy