Monday, 14 Jun, 7.56 pm ఆంధ్రజ్యోతి

జాతీయం-అంతర్జాతీయం
లిక్కర్ మాఫియా నుంచి రక్షణ కోరిన జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మృతి

లక్నో: లిక్కర్ మాఫియాపై కథనాలు ప్రసారం చేసి బెదిరింపులు ఎదుర్కొన్న ఓ చానల్ రిపోర్టరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో జరిగిందీ ఘటన. 42 ఏళ్ల రిపోర్టర్ సులభ్ శ్రీవాస్తవ లిక్కర్ మాఫియాపై కథనాలు ప్రసారం చేశాడు. రెండు రోజుల క్రితం తనకు రక్షణ కల్పించాలంటూ ప్రయాగ్‌రాజ్ ఏడీజీకి లేఖ రాశాడు. అంతలోనే అతడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

శ్రీవాస్తవ ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఓ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఆదివారం అతడు అస్రాహీ గ్రామం నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఏఎస్పీ సురేంద్ర ద్వివేదీ తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీవాస్తవను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఈ ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top