Dailyhunt
LIVE: రంగుల విషయంలో హైకోర్టు చెప్పిందే ఫైనల్ అన్న సుప్రీం

LIVE: రంగుల విషయంలో హైకోర్టు చెప్పిందే ఫైనల్ అన్న సుప్రీం

అమరావతి: రంగుల విషయం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడానికి సంబంధించి దాదాపు వెయ్యికోట్లకుపైగా ప్రభుత్వ ధనాన్ని కేటాయించి రంగులు ఎందుకు వేస్తారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దానిపై హైకోర్టు ఓ తీర్పు చెప్పింది. రంగులు వేయొద్దంటూ మార్చి 10న హైకోర్టు తీర్పు చెప్పగా దానికి విరుద్ధంగా ఏప్రిల్ 23న ప్రభుత్వం 623 జీవోను తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం ఉన్న రంగులు తొలగించడం కాకుండా కొత్త రంగును జతపరుస్తూ... కొత్త భాష్యం చెబుతూ...నాలుగు రంగులు వేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.

ఇది కచ్చితంగా కోర్టు తీర్పును ఉల్లంఘించడమే అంటూ మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దానిపై విచారణ జరిపిన కోర్టు 623 జీవోను కొట్టివేసింది.

దీనిపై సుప్రీంను ప్రభుత్వం ఆశ్రయించగా... ఉన్నతన్యాయస్థానం కూడా హైకోర్టు చెప్పిన తీర్పును అమలు చేయాల్సిందే అని తేల్చిచెప్పింది. ఉద్దేశపూర్తకంగా హైకోర్టును తప్పుదారి పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో కాంగ్రెస్ నేత సుందర్‌రామ్ శర్మ, టీడీపీ ఎమ్మెల్సీ రామకృష్ణ, బీజేపీ నేత జయప్రకాష్, జనసేన నేత సుందరపు విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy