Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లుసానె డైమండ్ లీగ్: బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా

లుసానె డైమండ్ లీగ్: బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో రజత పతకం సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తదుపరి సవాల్‌కు సిద్ధమయ్యాడు. ఆగస్టు 21 నుంచి స్విట్జర్లాండ్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక లుసానె డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగనున్నాడు.

ఈ టోర్నీలో కామన్వెల్త్ స్వర్ణ విజేత, శ్రీలంక స్టార్ రమేశ్ పతిరాజె, పాకిస్థాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్‌తో పాటు ప్రపంచ అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్లు పాల్గొననుండటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో రమేశ్ పతిరాజె 89.75 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించగా, నీరజ్ 85.83 మీటర్ల అత్యుత్తమ ప్రయత్నంతో రజత పతకం దక్కించుకున్నాడు. ఇప్పుడు డైమండ్ లీగ్‌లో ఈ ఇద్దరూ మరోసారి తలపడనున్నారు. వీరితో పాటు ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కేశోర్న్ వాల్కాట్, గ్రెనడా స్టార్ అండర్సన్ పీటర్స్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన యాకుబ్ వాడ్లెజ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, అమెరికా అథ్లెట్ కర్టిస్ థాంప్సన్ కూడా బరిలోకి దిగనున్నారు.

కామన్వెల్త్ గేమ్స్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలో 80.97 మీటర్లు, రెండో ప్రయత్నంలో 85.83 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత 81.29, 80.73 మీటర్ల త్రోలు నమోదు చేయగా, చివరి రెండు ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. దీంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. కాగా సెప్టెంబరులో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు ముందు లుసానె డైమండ్ లీగ్ కీలక పరీక్షగా భావిస్తున్నారు. నీరజ్, అర్షద్ నదీమ్, రమేశ్ పతిరాజె మధ్య జరిగే ఈ పోరు అథ్లెటిక్స్ అభిమానులను మరోసారి అలరించనుంది.

strong>

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు: భారత్ వైదొలిగితే.. యువ పేసర్లకు బీసీసీఐ ఛాన్స్!

ఆ ఒక్కసారే కేఎల్ రాహుల్‌ కోపంగా ఉండటం చూశా: వసీం జాఫర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy