Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి

మీ సంక్షేమ పథకాలు వర్తించేలా చేయండి

మహారాష్ట్రలోని 42 గ్రామాల తీర్మాన ప్రతులను

మంత్రి హరీశ్‌రావుకు అందజేసిన నాందేడ్‌ వాసులు

సిద్దిపేట టౌన్‌, అక్టోబరు 29 : తమ గ్రామాలను తెలంగాణలో కలుపుకుని, సంక్షేమ పథకాలు వర్తించేలా చూడాలని మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా నాయకులు గురువారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును కలిశారు. తమను తెలంగాణలో కలుపుకోవాలని 42 గ్రామాలు తీర్మానం చేసిన ప్రతులను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 42 గ్రామాలను తెలంగాణలో కలపాలని మంత్రిని కోరినట్లు చెప్పారు.

మహారాష్ట్రలో ఉన్నామే కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు, సౌకర్యాలు లేవని ఆవేదన చెందారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. నాందేడ్‌ వాసుల విజ్ఞప్తిని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy