రాజమండ్రి: జగన్ రెడ్డి జాంబిరెడ్డిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలను జగన్ కరుస్తున్నారని, అందుకే వారు అలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం అనపర్తిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి లోకేష్ హాజరై మాట్లాడుతూ ''అనపర్తిలో అభివృద్ది నిల్, అవినీతి ఫుల్. అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే మంచి నటుడు, అవినీతిపరుడు. కాపవరంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలతో 400 కోట్ల రూపాయలు దోపిడి చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అడ్డుకున్నారు. 2024లో టీడీపీ మళ్ళీ అదికారంలోకి వస్తుంది. జగన్ నాన్న, తాతలే టీడీపీని ఏమీ చేయలేకపోయారు.
టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే వైసీపీ నేతల తాటతీయిస్తాం'' అని లోకేష్ అన్నారు.

