Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడి పరిస్థితి విషమం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాంజీ చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం ఏలూరులో స్లీపింగ్ పిల్స్ మింగి రాంజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, కార్డియాక్ అరెస్టు కావడంతో వెంటనే అతడిని విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాంజీ పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్యులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy