Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి.. సీపీ సజ్జనార్ ఆదేశాలివే

మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్ల మృతి.. సీపీ సజ్జనార్ ఆదేశాలివే

హైదరాబాద్, జూన్ 12: మామిడి పండ్లు తిని అక్కాచెల్లెళ్లు మృతి చెందిన ఘటనపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మామిడి పండ్లు తిని భువనేశ్వరి(17), సంధ్య(10) తీవ్ర అస్వస్థకు గురై..

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటక బీదర్‌ వాసులు వైజినాథ్‌, ఇందుమతి దంపతులు కొన్నాళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఇందుమతి బంధువు రేణుక ఈనెల జలమండలి వద్ద రెండు కేజీల మామిడి పండ్లను కొనుగోలు చేసింది. ఆ పండ్లను ఇందుమతి, ఆమె నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆపై వారంతా వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. చికిత్స పొందుతూ అక్కాచెల్లెళ్లు భువనేశ్వరి(17), సంధ్య(10) మృతి చెందగా.. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కాచెల్లెళ్ల మృతికి మామిడి పండ్లు తొందరగా మగ్గేందుకు వినియోగించే రసాయనాలు కారణమా?... లేక ఇతర పదార్థాల వల్ల జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, వైద్యుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఫుడ్, ఫ్రూట్ నమూనాలను సేకరించిన అధికారులు.. పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. గత నెలలో ఛత్తీస్‌గఢ్ జాంజ్ గిరి-చంపా జిల్లాలో పుచ్చకాయ తిని 15 ఏళ్ల బాలుడు మరణించగా, మరో ముగ్గురు పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో వరుస ఘటనలతో మామిడి పండ్లు, పుచ్చకాయలు కొనాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


రాబోయే మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

వారి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy