Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'మానవ అక్రమణ రవాణా అరికడదాం'

'మానవ అక్రమణ రవాణా అరికడదాం'

పార్వతీపురం టౌన్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి అన్నారు.

గురువారం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మానవ అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు బాధితుల హక్కుల పరి రక్షించడం కోసం ప్రభుత్వ శాఖలు సమష్టిగా పనిచేయాలన్నారు. కొత్త తరహ మానవ అక్రమ రవాణాపై అందరూ దృష్టి సారించాలన్నారు.

విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే ముందు ఆయా సంస్థల వివరాలను తెలుసుకోవాలన్నారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు గానీ సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ బి.వెంకటరావు, కళాశాల కరస్పాండెంట్‌ సాయిగణేష్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy