Dailyhunt
మాట్లాడితే చాలు కేసులు పెడుతున్నారు: జేసీ ప్రభాకరరెడ్డి

మాట్లాడితే చాలు కేసులు పెడుతున్నారు: జేసీ ప్రభాకరరెడ్డి

అనంతపురం: టీడీపీ నేతలు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకున్నా... మాట్లాడితే చాలు కేసులు పెడుతున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందన్నారు. నాజీ తరహా పాలన కొనసాగుతోందని చెప్పారు. టీడీపీ నేతలను చెప్పులతో కొడతామని వైసీపీ నేతలు మాట్లాడినా ఎలాంటి కేసులు ఉండవన్నారు. పోలీసులు 'ఆదర్స్' పేరుతో ఘటనలతో సంబంధం లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy