Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాతృదేశానికి పయనమైన 90 ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానం

మాతృదేశానికి పయనమైన 90 ఏళ్ల డా.భానుమతి ఇవటూరి - డాలస్‌లో సన్మానం

పలు దశాబ్దాలుగా డాలస్‌లోని అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన డా. భానుమతి ఇవటూరి(90) ముదిమి వయసులో మాతృదేశానికి పయనమయ్యారు. అంతకుముందు, ఆమెను పలువురు ప్రవాస సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

పార్క్‌ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ వంటి సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు డా. భానుమతి ఇవటూరి నిర్వహించారు.

ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(IANT) పూర్వాధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షుడు బాపు నూతి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం, కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్ ప్రసాద్, రావు కల్వల, డా. పుదూర్ జగదీశ్వరన్‌లు ఆమెను జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ సమస్యకు-పరిష్కారానికి మధ్య, వివాదానికి-అవగాహనకు మధ్య, గందరగోళానికి-స్పష్టతకు మధ్య, నిరాశకు-ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారని కొనియాడారు. మనవల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయనే ప్రామాణికత ఆధారంగా విజయాన్ని లెక్కించాలనే ఆమె సూత్రం ఆదర్శనీయమని అన్నారు. అమెరికాలో 50ఏళ్లు జీవించిన అనంతరం చరమాంకంలో ఇండియాకు పయనమనమవుతున్న డా. భానుమతి జీవితం ఆనందంగా గడవాలని శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రవాసులు భానుమతి సేవలను కొనియాడారు.

ఈ వార్తలనూ చదవండి:

వచ్చే నెలలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం

శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ 5కే వాక్ విజయవంతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy