Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మావోయిస్టులు మానవాతీతులు కారు: మావోయిస్టు పార్టీ

హైదరాబాద్: మావోయిస్టులు మానవాతీతులు కారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. కరోనాతో మావోయిస్టుల మరణాలంటూ పోలీసుల ప్రచారం బూటకమంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరిట ప్రకటన విడుదల అయింది. కొవిడ్‌తో మావోయిస్టుల మరణాలనేది పోలీసుల కల్పితమని అభయ్ పేర్కొన్నారు. కరోనా పేరుతో లొంగిపోవాలని కోరడం దివాళాకోరు తనానికి నిదర్శనమని అభయ్ అన్నారు. కరోనా కట్టడి, వ్యాక్సిన్ విషయంలో మోదీ సర్కారు విఫలమైందని ఆ ప్రకటనలో అభయ్ విమర్శించారు. మావోయిస్టులు మానవాతీతులు కారని, వారికి కరోనా సోకదనే గ్యారంటీ ఏమీ లేదని అభయ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తమ వారికి కరోనా సోకలేదని మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy