Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే 48 గంటలు వర్షాలు

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాబోయే 48 గంటలు వర్షాలు

అమరావతి: మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది క్రమంగా బలపడేటువంటి అవకాశం ఉందని పేర్కొన్నారు. అల్ప పీడనం వాయువ్య దిశగా పయనిస్తోందన్నారు. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రాబోయే 48 గంటలు వర్షాలు కొనసాగుతాయన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు.. కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy