Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. అలాంటి వాళ్లు హిందువులే..

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. అలాంటి వాళ్లు హిందువులే..

మిళనాడు: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. విదేశీ పేరు, పౌరసత్వం ఉన్నంత మాత్రాన హిందూ గుర్తింపును నిరాకరించలేమని తేల్చి చెప్పింది. హిందూ మతాన్ని స్వీకరించడానికి ఎలాంటి సర్టిఫికెట్లు, ప్రత్యేక వేడుకలు అవసరం లేదని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది.

ఈ మేరకు తమిళనాడు దేవాదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ, అమెరికా పౌరురాలు లారా ఫ్రాన్సెస్ అయ్యంగార్‌ను హిందూ భక్తురాలిగానే పరిగణించాలని ఆదేశించింది.

లారా ఫ్రాన్సెస్‌ను 'అమెరికన్ క్రైస్తవ మహిళ'గా పేర్కొంటూ తమిళనాడు దేవాదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశీయులు అనగానే క్రైస్తవులని అంచనా వేయడం తప్పు అని తెలిపింది. మనఃస్ఫూర్తిగా మతాన్ని ఆచరిస్తూ, హిందూ జీవన విధానాన్ని పాటిస్తే వారు హిందువులే అవుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు తంజావూరు ఆలయంలో హిందూ మహిళలకు ఉండే అన్ని పూజా, దర్శన హక్కులు అమెరికన్ మహిళకు కూడా వర్తిస్తాయని తేల్చి చెప్పింది. ఆగమ శాస్త్రాలు, ఆలయ నిబంధనలకు లోబడి విదేశీ హిందూ భక్తురాలికి సమాన హక్కులు కల్పించాలని మద్రాస్ హైకోర్టు హుకుం జారీ చేసింది.

strong>

కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా గోయల్ పాత వీడియో వైరల్..

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు.. 'ఐదు సంకల్పాలు' స్వీకరించాలని పిలుపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy