Dailyhunt

మహిళా లోకానికి జగన్‌ క్షమాపణ చెప్పాలి: కేశినేని శ్వేత

విజయవాడ: మహిళా లోకానికి జగన్‌ క్షమాపణ చెప్పాలని ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత డిమాండ్ చేశారు. పూజించాల్సిన మహిళల్ని లాఠీలతో వేధించడం సిగ్గుచేటన్నారు. మహిళా దినోత్సవం నాడు మహిళా రైతులపై లాఠీ చార్జి హేయమన్నారు. మహిళల కన్నీరుకు కారణమైన జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి కూడా అనుమతించరా..? అని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే.. భక్షిస్తుంటే.. హోం మంత్రి ఏం చేస్తున్నట్లని కేశినేని శ్వేత నిలదీశారు. హోం మంత్రిగా ఉన్న మహిళ చేతులు కట్టుకుని చూస్తున్నందుకు సిగ్గుపడాలన్నారు. మహిళల్ని, రైతుల్ని కన్నీరు పెట్టించి జగన్ రెడ్డి నియంతలా మారారన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

అరెస్టు చేసిన మహిళలను భేషరతుగా విడుదల చేయాలని కేశినేని శ్వేత డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy