Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళ రెండు పాత్రలు పోషిస్తుంది: ఎమ్మెల్యే భవానీ

మహిళ రెండు పాత్రలు పోషిస్తుంది: ఎమ్మెల్యే భవానీ

రాజమండ్రి: రాజకీయాలతోపాటు సేవాకార్యక్రమాల్లోనూ.. మంచి గృహిణిగానూ అందరి అభిమానాలను రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అందుకుంటున్నారు. సిక్కోలు సింహం ఎర్రంనాయుడు కుమార్తెగా, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలిగా ఆమె రాజకీయాల్లో రాణిస్తున్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మహిళ రెండు పాత్రలు పోషిస్తుందని అన్నారు. గృహిణిగా ఉంటూ తాను చేస్తున్న ఏపని అయినా దానికి న్యాయం చేస్తుందని అన్నారు. పురుషులకంటే ధీటుగా రెండువైపులా మహిళలు రాణిస్తారన్నారు. ఏపీలో ప్రతి రోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం దిశ చట్టం పెట్టిందని...ఇంత వరకు అది అమలు చేయలేదని భవానీ విమర్శించారు.

మహిళలు అధైర్యపడకుండా అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆమె సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy